సివిల్ సర్వెంట్ల సహకారంతోనే దేశాభివృద్ధి : రాష్ట్రపతి ముర్ము

సివిల్ సర్వెంట్ల సహకారంతోనే దేశాభివృద్ధి : రాష్ట్రపతి ముర్ము
x
Highlights

దేశంలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లచే ఎంపిక చేసి, తీర్చిదిద్దబడిన సివిల్ సర్వెంట్ల ప్రధాన సహకారం వల్లే భారతదేశం ఒక ముఖ్యమైన ఆర్థిక, రాజకీయ శక్తిగా ఆవిర్భవించేందుకు సాధ్యపడిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.

హైదరాబాద్: దేశంలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లచే ఎంపిక చేసి, తీర్చిదిద్దబడిన సివిల్ సర్వెంట్ల ప్రధాన సహకారం వల్లే భారతదేశం ఒక ముఖ్యమైన ఆర్థిక, రాజకీయ శక్తిగా ఆవిర్భవించేందుకు సాధ్యపడిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్స్‌ ఛైర్‌ పర్సన్ల జాతీయ సదస్సులో ఆమె ప్రసంగించారు. దేశాన్ని విధానపరంగా బలోపేతం చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్య భూమిక పోషిస్తారన్నారు.

నియామకాల అంశంలో సర్వీస్‌ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని తెలిపారు. 1950 తర్వాత UPSC, పబ్లిక్‌ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు అయ్యాయని గుర్తుచేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల అంశంలో అంబేద్కర్‌ కీలకపాత్ర పోషించారని చెప్పారు. నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరిగతిన పరిష్కారం అవసరమని తెలిపారు. నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భాగ్యనగరంలో ఇవాళ(శుక్రవారం) పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటున్నారు. రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతికి తెలంగాణ మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ పర్యటనలో ఆమె వెంట మంత్రి సీతక్క ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories