పండగపూట విషాదం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు..

పండగపూట విషాదం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు..
x

పండగపూట విషాదం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు..

Highlights

Car Falls into Well: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Car Falls into Well: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కారు అదుపుతప్పి బావిలో పడటంతో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాత్రి చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా కడం మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అత్యవసర పనిమీద ఖానాపూర్ మండలం రంగపేట్ గ్రామానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

బీర్నంది గ్రామ పంచాయతీ పరిధిలోని కొమ్ముతండా సమీపంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న బావిలో కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కడం మండల కేంద్రంలోని ‘మన్ గ్రోమోర్’ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories