నిజామాబాద్‌లో ORS ప్యాకెట్‌లో చెత్త.. వినియోగదారుల ఆందోళన

నిజామాబాద్‌లో ORS ప్యాకెట్‌లో చెత్త.. వినియోగదారుల ఆందోళన
x

నిజామాబాద్‌లో ORS ప్యాకెట్‌లో చెత్త.. వినియోగదారుల ఆందోళన

Highlights

నిజామాబాద్ వర్నిలో మెడ్ ప్లస్ షాపు ఎదుట వినియోగదారుల ఆందోళన ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌లో చెత్త వచ్చిందని ఆరోపణ రెడ్డిస్ కంపెనీ ORS ప్యాకెట్లను కొనుగోలు చేసిన షేక్ మహబూబ్ అనే వ్యక్తి ORSలో చెత్త రావడంతో నిర్వాహకులను ప్రశ్నించిన బాధితుడు

నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో మెడ్ ప్లస్ మెడికల్ షాపు ముందు వినియోగదారులు ఆందోళన చేశారు. ORS ప్యాకెట్‌లో చెత్త వచ్చిందని ఆరోపించారు. అక్బర్ నగర్ గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ అనే వ్యక్తి.. రెడ్డిస్ కంపెనీకి చెందిన ORS ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. వాటిని సేవించగా ప్యాకెట్‌లో చెత్త రావడంతో.. మెడికల్ షాపుకి వెళ్లి నిర్వాహకులను ప్రశ్నించారు. అనారోగ్యంతో ఉన్నవారికి చెత్తతో కూడిన ORS తాగించడం వలన మరింత అనారోగ్యం పాలయ్యారని వాగ్వివాదానికి దిగారు. మెడ్‌ప్లెస్‌ యాజమన్యాన్ని ఫోన్లో సంప్రదించగా.. ORS రెడ్డిస్ ల్యాబ్ వారివి అని నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. దీంతో బాధితులు ,స్థానికులు ఆందోళనకు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని.. మెడికల్ యాజమాన్యంతో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories