NOTA: పంచాయతీ ఎన్నికల్లోనూ నోటా.. తొలిసారి నోటాకు చోటు కల్పించిన ఈసీ

NOTA: పంచాయతీ ఎన్నికల్లోనూ నోటా.. తొలిసారి నోటాకు చోటు కల్పించిన ఈసీ
x

NOTA: పంచాయతీ ఎన్నికల్లోనూ నోటా.. తొలిసారి నోటాకు చోటు కల్పించిన ఈసీ

Highlights

NOTA: ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకే పరిమితమైన నోటాకు పంచాయతీ ఎన్నికల్లోను చోటు దక్కింది.

NOTA: ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకే పరిమితమైన నోటాకు పంచాయతీ ఎన్నికల్లోను చోటు దక్కింది. పైన పేర్కొన్న అభ్యర్థులు నచ్చలేదని ఓటర్లు తమ తీర్పు ఇచ్చే అవ కాశం ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్నికల సంఘం కల్పించింది. నోటా ఎవరి నోట్లో మట్టి కొడుతుందన్న టెన్షన్ అభ్యర్థులను పట్టుకుంది.

తెలంగాణలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ ఓటర్లకు నోటా ఛాన్స్ కల్పిస్తున్నారు. బ్యాలెట్ పత్రంపై అభ్యర్థుల గుర్తులతో పాటు నోటా గుర్తును కూడా ముద్రిస్తున్నారు అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేసేందుకు సిద్ధంగా లేకపోతే ఓటరు నోటాకు వేయొచ్చు.

వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నా ఓటర్లకు ఏ అభ్యర్థి నచ్చకపోయినా నికచ్చిగా చెప్పాలంటే నోటా ఉండాలని ఎన్నికల కమిషన్ 2013లో నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో నోటాకు అవకాశం కల్పించింది.కానీ బ్యాలెట్ల ద్వారా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాకు చోటు కల్పించలేదు. ఈసారి ఎన్నికల్లో నోటాకు తొలిసారి ఎన్నికల సంఘం చోటు కల్పించింది. నోటాకు ఓటు వేసే అవకాశం ఉందని పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. ఓటర్లకు సమాచారం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం టీఈ-పోల్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా ఓటరు స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడం, పోలింగ్ కేంద్రం చిరునామా తెలుసుకోవడం, పోలింగ్ ప్రక్రియపై ఫిర్యాదులు చేయడం, వాటి పరిష్కార ప్రగతిని పరిశీలించవచ్చు.

ఎన్నికల నియమావళి తప్పకుండా పాటించాలని ఈసీ సూచించింది. రాష్ట్ర మంత్రులు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి వస్తే అధికారిక వాహనాలు వాడరాదు. సొంత వాహనాలనే తీసుకెళ్లాలి. ప్రభుత్వ సిబ్బందిని సైతం వారితో తీసుకెళ్లకూడదు. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయరాదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, సర్పంచ్‌లు, ప్రభుత్వోద్యోగులు పోలింగ్‌ లేదా కౌంటింగ్‌ ఏజెంట్లుగా ఉండకూడదు. సర్పంచ్‌, వార్డు సభ్యులుగా పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రచారానికి వారం రోజులే కేటాయించారు. పోలింగ్‌ ముగియడానికి నిర్దేశించిన సమయానికి 44 గంటల ముందు ప్రచారం ఆపేయాలని ఎస్‌ఈసీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి కోసం అభ్యర్థి, వారి తరఫున ఎవరైనా కులం, మతం, జాతి, వర్గం, భాషా ప్రాతిపదికన ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు రెచ్చగొట్టొద్దని ఎస్‌ఈసీ నిబంధనల్లో పేర్కొంది. ప్రజల్లో విద్వేషాలు పెంచడాన్ని అవినీతి చర్యగానే పరిగణిస్తామని, విద్వేషాలతో రెచ్చగొట్టినవారు గెలిచినా వారి సభ్యత్వం రద్దు చేస్తామని వెల్లడించింది. దాన్ని ఎన్నికల నేరంగా పరిగణిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని తెలిపింది. ఓటర్లకు తాయిలాలు ఇవ్వజూపడం, బెదిరించడం, భయపెట్టడం, దొంగ ఓట్లను ప్రోత్సహించేలా వ్యవహరించడం వంటివి చేయరాదు.

ఏదేమైనా ఓటర్లు తమ తీర్పును స్పష్టం చేయడానికి గుర్తులతో పాటు నోటాకు చోటు కల్పించడంతో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories