రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతం

రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతం
x
Highlights

రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనది అని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ రామారావు పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి అన్నారు.

హైదరాబాద్: రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనది అని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ రామారావు పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి అన్నారు. ఆడియో రూపంలో రూపొందించిన 1984 ఆగస్టు పరిరక్షణోద్యమ సజీవ చరిత్ర పుస్తకాన్ని శనివారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్(FNCC)లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని, ఆడియోని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత, మా తెలుగు తల్లికి... గీతాలాపన జరిగింది.

జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీ జనార్దన్ చైర్మన్ గా ఉన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రూపొందించిన సజీవ చరిత్ర పుస్తకం ఆడియోని విడుదల చేశారు. ఇందులో సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, నందమూరి రామకృష్ణ, సినీ నిర్మాత కె ఎస్ రామారావు, బొల్లినేని క్రిష్ణయ్య, చైతన్య రాజు, పుస్తక రచయిత విక్రమ్ పూల, ఆడియో పుస్తకానికి గాత్రధారణ చేసిన గాయత్రి, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు రామ్మోహన్ రావు, గుమ్మడి గోపాలకృష్ణ, మండవ సతీష్, మధుసూదనరాజు, బిక్కి కృష్ణ, ప్రొఫెసర్ వెంకట్, పర్వతనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ముందుగా రచయిత విక్రమ్ పూల పుస్తక పరిచయం చేశారు. స్వాగతోపన్యాసం చేసిన కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్.. ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాల్లో చేసిన కృషిని, ఆయన నెలకొల్పిన ఉన్నత ప్రమాణాలను ప్రస్తావించారు. ఆంధ్రదేశానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించినా అందరికి గుర్తుండిపోయేది ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. తెలుగునాట రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత అన్నట్టుగా పాలనా సాగిందని చెప్పారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని తాము ఎన్టీఆర్ సిద్ధాంతాల భావజాలాన్ని ముందుతరానికి, తర్వాత తరానికి తెలియజెప్పాలని ఉద్దేశ్యంతో కమిటీ ఏర్పాటు చేసారని అందరి సహకార సమన్వయంతో ఎన్టీఆర్ పై పలు పుస్తకాలు వెలువరిస్తున్నామని ప్రత్యేకంగా అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశామని భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని, ఎన్టీఆర్ పేరుని అజరామరం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories