Pawan Kalyan: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్.. షెడ్యూల్ ఖరారు!

Pawan Kalyan: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్.. షెడ్యూల్ ఖరారు!
x

Pawan Kalyan: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్.. షెడ్యూల్ ఖరారు!

Highlights

Pawan Kalyan: తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Pawan Kalyan: తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతుండటంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పవన్ కల్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో (శని, ఆదివారాలు) విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏపీలో కూటమి విజయం తర్వాత తెలంగాణలో కూడా అదే ఊపును కొనసాగించాలని జనసేన భావిస్తోంది.

ఈ ఎన్నికల్లో జనసేన మరియు భారతీయ జనతా పార్టీ (BJP) కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ ఉమ్మడి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ పవన్ కల్యాణ్ రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పవన్ కల్యాణ్ ఏయే ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు? ఎక్కడెక్కడ సభలు నిర్వహించనున్నారు? అనే అంశాలపై జనసేన కార్యాలయం కసరత్తు చేస్తోంది. పూర్తిస్థాయి షెడ్యూల్ మరియు రూట్ మ్యాప్‌ను మరికొద్ది గంటల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories