Phone Tapping Case: ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట.. అరెస్టు నుంచి మినహాయింపు!

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావుకు అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 10 March 2026 3:33 PM IST
Phone Tapping Case: ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట.. అరెస్టు నుంచి మినహాయింపు!
X

Phone Tapping Case: ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట.. అరెస్టు నుంచి మినహాయింపు!

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావుకు అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఆయనను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు మంగళవారం రక్షణ కల్పించింది.

నిబంధనలతో కూడిన మినహాయింపు:

జస్టిస్ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ మినహాయింపు కొన్ని కఠినమైన షరతులకు లోబడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

నిందితుడు దర్యాప్తు అధికారుల విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది.

కేసులోని సాక్ష్యాలను తారుమారు చేసినా లేదా సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినా మంజూరు చేసిన ముందస్తు బెయిల్ తక్షణమే రద్దవుతుందని హెచ్చరించింది.

ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ప్రభాకర్‌రావు ఎక్కడికీ వెళ్లకూడదని, అందుబాటులో ఉండాలని న్యాయస్థానం పేర్కొంది.

కేసు నేపథ్యం:

రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతలు, ఇతర ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై ప్రభాకర్‌రావుతో పాటు మరికొందరు అధికారులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అరెస్టు నుంచి రక్షణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజా ఉత్తర్వులతో ఆయనకు ఊరట లభించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story