ముజ్రా పార్టీ భగ్నం.. రిసార్ట్ యజమాని, ఈవెంట్ మేనేజర్లపైన కేసు నమోదు చేసిన అధికారులు

ముజ్రా పార్టీ భగ్నం.. రిసార్ట్ యజమాని, ఈవెంట్ మేనేజర్లపైన కేసు నమోదు చేసిన అధికారులు
x
Highlights

రంగారెడ్డి జిల్లా ఘట్టుపల్లి సమీపంలోని కేసీఆర్ రిసార్ట్స్‌లో పోలీసులు దాడులు నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా ఘట్టుపల్లి సమీపంలోని కేసీఆర్ రిసార్ట్స్‌లో పోలీసులు దాడులు నిర్వహించారు. సీడ్ కంపెనీలకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు, యజమానులు మద్యం పార్టీని ఏర్పాటు చేశారు. మహేశ్వరం SOT పోలీసులు రిసార్ట్స్‌ను చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ పార్టీలో దాదాపు 20 మంది మహిళా డ్యాన్సర్లు, 52 మంది సీడ్ కంపెనీ డీలర్లు పాల్గొన్నారు. ఇది రేవ్ పార్టీ కాదని లిక్కర్, ముజ్రా పార్టీ అని మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. 2 బీర్ బాటిళ్లు, 3 మధ్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని రిసార్ట్ యజమాని, ఈవెంట్ మేనేజర్లపైన కేసు నమోదు చేశారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories