ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు

Arekapudi Gandhi: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసునమోదు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 14 Sept 2024 10:28 AM IST
Police Registered Attempted Murder Case Against Arekapudi Gandhi
X

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు

Kaushik Reddy and Arekapudi Gandhi: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసునమోదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు అరికెపూడి గాంధీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడిపైనా గచ్చిబౌలి పోలీసులు కేసు పెట్టారు. మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీకాంత్‌గౌడ్‌లపైనా కేసు నమోదు అయింది. ఘటనపై ఎస్ఐ మహేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో రెండ్రోజుల క్రితమే ఒక కేసునమోదు చేశారు పోలీసులు. ఆ కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బెయిల్ తీసుకున్నారు. తాజాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసును ఫైల్ చేశారు.

ఇదిలా ఉంటే అరికెపూడి గాంధీ,కౌశిక్ రెడ్డిల మధ్య మూడు రోజులుగా వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. గురువారం నాడు అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగగా.. జనాల్లో కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అరికెపూడి గాంధీని ౩౦ మందికి పైగా ఆయన అనుచరులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ముందుగా ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయకపోయినా తాజాగా ఈ సెక్షన్‌ ౩౦7ని కూడా చార్జ్ షీట్‌లో నమోదు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story