Raja Singh: నిమజ్జనంపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

Raja Singh: ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం చేయకపోతే.. ఎక్కడ వేయాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని రాజాసింగ్ కోరారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 10 Sept 2024 7:19 PM IST
Raja Singh
X

Raja Singh

Raja Singh: వినాయక్ సాగర్‌లో నిమజ్జనంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం చేయకపోతే.. ఎక్కడ వేయాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని రాజాసింగ్ కోరారు. ట్యాంక్‌బండ్ పరిసరాల్లోని మురుగునీరు అంతా ట్యాంక్‌బండ్‌లోనే ఉంటుందని.. ఆల్రెడీ పొల్యూటెడ్ నీటిలోనే నిమజ్జనం చేస్తున్నామని అధికారులే కోర్టుకు తెలిపాలన్నారు.

ప్లాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాలు ట్యాంక్‌బండ్‌లో వేస్తే.. నీరు కలుషితం కాదన్నారు. అది నీటిలో కరగడానికి 20 రోజులు పడుతుందని.. కానీ... నిమజ్జనం చేసిన మూడో రోజే విగ్రహాలను బయటికి తీస్తారని..దాని ద్వారా వందల టన్నుల ఇనుము వస్తుందని... అది GHMCకి లాభమేనని రాజాసింగ్ తెలిపారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story