Rajya Sabha Elections 2026: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో రెండు స్థానాలకు..

Rajya Sabha Elections 2026: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో రెండు స్థానాలకు..
x
Highlights

Rajya Sabha Elections 2026: దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Rajya Sabha Elections 2026: దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 10 రాష్ట్రాలకు చెందిన 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు ఈసీ కసరత్తు పూర్తి చేసింది.

ముఖ్యమైన తేదీలు ఇవే:

నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 26, 2026

నామినేషన్ల గడువు: మార్చి 05, 2026

నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 09, 2026

పోలింగ్ తేదీ: మార్చి 16, 2026 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

ఫలితాల ప్రకటన: మార్చి 16, 2026 (సాయంత్రం)

తెలంగాణలో రెండు స్థానాలకు పోరు

తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కీలక నేతల పదవీ కాలం ఏప్రిల్ 9తో ముగియనుంది.

కేఆర్ సురేష్ రెడ్డి (బీఆర్ఎస్)

అభిషేక్ మను సింఘ్వీ (కాంగ్రెస్)

వీరిద్దరి పదవీ కాలం ముగియనుండటంతో, తెలంగాణ కోటాలోని ఈ రెండు స్థానాలకు కూడా మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల దృష్ట్యా ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్న సభ్యుల స్థానంలో కొత్తగా ఎన్నికైన వారు సభలోకి అడుగుపెట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories