ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ సర్వేయర్‌ శ్రీనివాస్‌

ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ సర్వేయర్‌ శ్రీనివాస్‌
x
Highlights

రంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ సర్వేయర్‌ శ్రీనివాస్‌ ఏసీబీ వలలో చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్‌ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తోంది ఏసీబీ.

రంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ సర్వేయర్‌ శ్రీనివాస్‌ ఏసీబీ వలలో చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్‌ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తోంది ఏసీబీ. ఏకకాలంలో మూడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఏసీబీ రైడ్స్‌ కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఆరుచోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రంగారెడ్డి కలెక్టరేట్‌తో పాటు రాయదుర్గం మైహోం బుజాలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

ల్యాండ్‌ రికార్డ్స్‌ ఈడీగా శ్రీనివాస్‌ పెద్దఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్టు గుర్తించారు. మహబూబ్‌నగర్‌లో ఓ రైస్‌ మిల్లును గుర్తించిన ఏసీబీ అధికారులు.. షెల్‌ కంపెనీల పేరుతో శ్రీనివాస్‌ పలుచోట్ల వ్యాపారాలు చేస్తున్నట్టు ఆధారాలు సేకరించారు. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు.. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని న్యూప్రేమ్‌ నగర్‌లో శ్రీనివాస్‌ బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories