శివలింగంపై సూర్యకిరణాలు

శివలింగంపై సూర్యకిరణాలు
x
Highlights

మేళ్లచెరువు: సూర్యకిరణాలు శివలింగాన్ని తాకడం అనేది సాధారణంగా ఆశ్వయుజ మాసంలోనే జరుగుతుంది.

మేళ్లచెరువు: సూర్యకిరణాలు శివలింగాన్ని తాకడం అనేది సాధారణంగా ఆశ్వయుజ మాసంలోనే జరుగుతుంది. అయితే, ఈసారి భాద్రపద మాసంలోనే సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరించడం భక్తులను ఆశ్చర్యపరిచింది. సూర్యకిరణాలు శివలింగంపై పడటాన్ని భక్తులు అద్భుతంగా భావిస్తున్నారు.

సూర్యకిరణాలు ప్రసరించిన అరుదైన ఈ దృశ్యం నల్గొండ జిల్లా మేళ్లచెరువులోని ఇష్ట కామేశ్వరీ సమేత శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి కొంకపాక విష్ణువర్ధన్ శర్మ ఆధ్వర్యంలో శివలింగానికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories