Hyderabad: హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జ్‌.. ఈ సారి ఈ బ్రిడ్జ్ ఎక్కడంటే..

Hyderabad
x

Hyderabad: హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జ్‌.. ఈ సారి ఈ బ్రిడ్జ్ ఎక్కడంటే..

Highlights

Mir Alam Tank bridge: హైదారాబాద్ మహానగరం మరింత అందాలను అందుకోనుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ తరహాలో మరొక కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది.

Mir Alam Tank bridge: హైదారాబాద్ మహానగరం మరింత అందాలను అందుకోనుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ తరహాలో మరొక కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది. మరి ఇది ఎక్కడ నిర్మించబోతున్నారో తెలుసుకుందాం.

హైదరాబాద్ నగరం చారిత్రాత్మక ఆనవాళ్లకు నెలవు. అంతేకాదు అందమైన ప్రదేశాలు, అద్బుతమైన వివిధ రకాల సంస్కృతి సంప్రదాయలకు నిదర్శనం. ఇప్పటికే దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ భాగ్యనగరానికి ఆకర్షణగా నిలిచి, పర్యాటకానికి ఓ కొత్త దిక్చూచి అయింది. ఇప్పుడు ఇదే తరహాలో హైదరాబాద్‌లో మరొక కేబుల్ బ్రిడ్జ్ రానుంది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది.

సుమారు రూ. 430 కోట్ల వ్యయంతో మరో ఐకానిక్ బ్రిడ్జ్‌ను నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది మీరాలం చెరువుపై రానుంది. ఈ వంతెన నిర్మాణానికి మూసీ నది అభివృద్ధి సంస్థకు అప్పగిస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబందించిన భూసేకరణ, టెండరు ప్రక్రియలను తక్షణమే ప్రారంభించాలని ఆ ఉత్తర్య్వులో పేర్కొన్నారు. ఐకానిక్ బ్రిడ్జ్ మోడల్‌ను ఐఐటీ హైదరాబాద్, జెఎన్టీయూ, వరంగల్ నిట్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు చూపించి, నిపుణుల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే దీని నిర్మాణం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.

మీరాలం చెరువు హైదరాబాద్‌లో ఉన్న చారిత్రక చెరువుల్లో ఒకటి. మైలార్ దేవ్ పల్లి, హసన్ నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో కురిసే వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా నరగ దాహార్తిని తీర్చేందుకు మూడో నిజాం హయాంలో ఈ చెరువును నిర్మించారు. దీనికి దివాన్ మీర్ అలం బహదూర్ గారి పేరు పెట్టారు. 1804లో ప్రారంభమైన ఈ చెరువు 1806లో పూర్తయింది. ఈ చెరువు అర్ధ చంద్రాకారంలో ఉంటుంది. అందుకే పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ చెరువు దిగువున ఏర్పాటుచేసిన జూ మరో అట్రాక్షన్.

మీర్ అలం చెరువు, జూ.. ఈ రెండింటితో ఇప్పుడు ఆ ప్రాంతంలో కేబుల్ బ్రిడ్జ్‌ని నిర్మించి ఆ ప్రాంతాన్ని గొప్ప టూరిస్ట్ స్పాట్‌గా తీర్చి దిద్దాలనుకుంటుంది... తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు ఈ వంతెన పూర్తయితే బహదూర్ పుర, అత్తాపూర్, కిషన్ బాగ్, చింతల్ మెట్, శాస్త్రిపురం వంటి ప్రాంతాలకు వెళ్లడం ఈజీ అవుతుంది. అలాగే చింతల్ మెట్‌ నుంచి బెంగుళూరు హైవే మీదుగా విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఈ దారి ప్రధానంగా నిలవనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories