Sankranti Rush: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ

Sankranti Rush: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ
x
Highlights

Sankranti Rush: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ పతాక స్థాయికి చేరింది.

Sankranti Rush: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ పతాక స్థాయికి చేరింది. పండుగ కోసం సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో హైవే అంతా వాహనమయమైంది. ఈ రద్దీకి సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇవే:

హైవేపై ప్రస్తుత పరిస్థితి:

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టాయి. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం అధికారులు ప్రత్యేకంగా 10 టోల్‌ బూత్‌లను అందుబాటులోకి తెచ్చారు.

చిట్యాల, పెదకాపర్తి, కోదాడ, రామాపురం క్రాస్ రోడ్ల వద్ద వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. భారీగా కార్లు, బస్సులు తరలివస్తుండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది.

ప్రయాణం సురక్షితంగా సాగేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైవేపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ‘బ్లాక్ స్పాట్స్’ వద్ద పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories