Sankranti 2026: సంక్రాంతికి TGSRTC ప్రత్యేక బస్సులు.. 6,431 బస్సులు నడుపనున్న ఆర్టీసీ

Sankranti 2026: సంక్రాంతికి TGSRTC ప్రత్యేక బస్సులు.. 6,431 బస్సులు నడుపనున్న  ఆర్టీసీ
x
Highlights

Sankranti 2026: సంక్రాంతికి TGSRTC సన్నద్ధం అయ్యింది.. సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు tgsrtc ఏర్పాట్లు చేసింది.

Sankranti 2026: సంక్రాంతికి TGSRTC సన్నద్ధం అయ్యింది.. సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు tgsrtc ఏర్పాట్లు చేసింది. ఈ పండుగకు 6431 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రయాణికుల సౌకర్యార్థం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు.

సంక్రాంతి పండుగకు ఆంధ్ర తెలంగాణతో పాటు కర్ణాటక కు 6,431 ప్రత్యేక బస్సుల్ని నడపనున్నారు.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే 9, 10, 12, 13 తేదీల్లో ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.. అలాగే, ఈ నెల 18, 19 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు. సంక్రాంతి పండుగ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు.

ముఖ్యంగా నగరంలోని రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, KPHB, బోయిన్‌ల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనుంది. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది. TGSRTC బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ను www.tgsrtcbus.in వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లలో సంప్రదించాలని సూచించింది. ఇప్పటికే రైళ్లలో టికెట్లు అన్నీ ఫుల్ అవడంతో ఈ ప్రత్యేక బస్సులు పై దృష్టి సారించనున్నారు ప్రయాణికులు.

Show Full Article
Print Article
Next Story
More Stories