Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి, సంతాపం

Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి, సంతాపం
x

Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి, సంతాపం 

Highlights

సౌదీ అరేబియా లో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్ కు చెందిన ఉమ్రా యాత్రికుల మృతి పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు.

సౌదీ లో హైదరాబాద్ కు చెందిన ఉమ్రా యాత్రికుల బస్సు ప్రమాదం పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి, సంతాపం

సౌదీ అరేబియా లో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్ కు చెందిన ఉమ్రా యాత్రికుల మృతి పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు.

మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకొని సౌదీ అరేబియా లో ఉన్న ఎన్నారై కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మృతులకు ప్రగడ సంతాపం ప్రకటించారు.

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ విషాద ఘటన మృతుల్లో ఎక్కువగా మహిళలు,చిన్నారులు ఉన్నారని తెలిసి మంత్రి తీవ్రంగా చలించిపోయారు. అందులో హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారన్న వార్త మరింత దిగ్బ్రాంతికి గురిచేస్తోందన్నారు.

ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని,బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మంత్రి ప్రార్థించారు.


హజ్ యాత్రికుల మరణం పట్ల కేసీఆర్ సంతాపం

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు తెలంగాణ వాసులు మరణించడం పట్ల., తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత, కె. చంద్రశేఖర్ రావు గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హజ్ యాత్రలో భాగంగా, మక్కా నుండి మదీనా వెళుతున్న బస్సు, అగ్ని ప్రమాదానికి గురయ్యి అందులో ప్రయాణిస్తున్న 42 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపం ప్రకటించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని అన్నారు. మృతుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందజేయాలని కోరారు.

మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కేసీఆర్ గారు, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


సౌదీ అరేబియా లో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పై హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు.

మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకొని సౌదీ అరేబియా లో ఉన్న ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్, వైస్ చైర్మన్ భీమ్ రెడ్డి లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అధికారులు ఎన్నారై కమిటీ తో సమన్వయం చేసుకుంటూ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మృతులకు ప్రగాడ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

నాంపల్లి లోని హజ్ హౌస్ కు చేరుకున్న రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్...

Show Full Article
Print Article
Next Story
More Stories