Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డికి అస్వస్థత.. నిమ్స్ ఆస్పత్రికి తరలింపు!

Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డికి అస్వస్థత.. నిమ్స్ ఆస్పత్రికి తరలింపు!
x

Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డికి అస్వస్థత.. నిమ్స్ ఆస్పత్రికి తరలింపు!

Highlights

Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.

Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆయనకు ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆస్పత్రికి తరలించారు.

జీవన్‌రెడ్డి అస్వస్థతకు ఫుడ్ పాయిజన్ ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, గత కొంతకాలంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడికి (Stress) గురవుతున్నారని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. రాజకీయ సమీకరణలు, పార్టీలో జరుగుతున్న పరిణామాల వల్ల ఆయన కొంత ఆందోళనగా ఉన్నారని సమాచారం.

ప్రస్తుతం నిమ్స్ వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. జీవన్‌రెడ్డి అస్వస్థత వార్త తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ నాయకులు, అనుచరులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories