అబార్షన్ వికటించి ప్రియురాలు మృతి.. పరారైన హోంగార్డ్, ఆర్ఎంపీ డాక్టర్

అబార్షన్ వికటించి ప్రియురాలు మృతి.. పరారైన హోంగార్డ్, ఆర్ఎంపీ డాక్టర్
x
Highlights

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువతితో హోంగార్డ్ కొన్ని నెలలుగా సహజీవనం చేస్తున్నాడు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువతితో హోంగార్డ్ కొన్ని నెలలుగా సహజీవనం చేస్తున్నాడు. చివరికి ఆ యువతి గర్భవతి అయ్యింది. ఆ విషయాన్ని హోంగార్డ్‌కు ప్రియురాలు తెలిపింది. అది నచ్చని ప్రియుడు, ప్రియురాలికి అబార్షర్ చేయించేందుకు ఆర్ఎంపీ డాక్టర్‌ని సప్రదించాడు. యువతికి అబార్షన్‌ చేసే క్రమంలో వైద్యం వికటించి అమె పరిస్థితి విషమంగా మారింది.

యువతిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. యువతి మృతికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్, హోంగార్డ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు షాద్‌నగర్‌లోని రాయికల్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories