Nizambad: ఏర్గట్లలో ఉద్రిక్తత.. ప్రేమలో మోసపోవడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

Nizambad: ఏర్గట్లలో ఉద్రిక్తత.. ప్రేమలో మోసపోవడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
x
Highlights

Nizambad: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మోసపోయి సాఫ్ట్‌వేర్ యువకుడు శ్రీకాంత్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.

Nizambad: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మోసపోయి సాఫ్ట్‌వేర్ యువకుడు శ్రీకాంత్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్లుగా ప్రేమించుకున్న దొంచందకు చెందిన శ్రీకాంత్ రెడ్డి, ఏరుగట్లకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. ఉద్యోగరిత్యా లండన్‌లో ఉంటున్న శ్రీకాంత్‌రెడ్డి ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కోసం స్వస్థలానికి వచ్చాడు. దీంతో ఆ యువతిని నమ్మించి తండ్రి మరో యువకుడితో పెళ్లి జరిపించాడు. ఇది తెలుసుకున్న యువకుడు శ్రీకాంత్ పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా...చికిత్స పొందుతూ శ్రీకాంత్ మరణించాడు. ఆగ్రహించిన యువకుడి బంధువులు డెడ్ బాడీతో ఆందోళన నిర్వహించారు.

బంధువులు యువకుడి మృతదేహంతో ఏర్గట్ల పోలీస్​స్టేషన్ ముట్టడికి యత్నించారు. తాళ్లరాంపూర్​రోడ్డులో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆగ్రహంతో బంధువులు మృతదేహాన్ని పోలీస్​వాహనంపై పెట్టి నిరసన తెలిపారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భారీగా పోలీసులు చేరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories