Southwest monsoon: తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు..వచ్చే 3 రోజులు భారీ వర్షాలు

A storm has crossed the coast, bringing rain to Telugu states
x

Heavy Rain: తీరం దాటిన వాయుగుండం..తెలుగు రాష్ట్రాలకు వర్ష గండం

Highlights

Southwest monsoon: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అంచనా వేసిన సమయం కంటే...

Southwest monsoon: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అంచనా వేసిన సమయం కంటే ముందుగానే వచ్చినట్లు పేర్కొంది. ఉత్తర తెలంగాణపై ద్రోణి ప్రభావం కొనసాగుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని..ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం మహబూబ్ నైరుతి రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్ ఘడ్, దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు సగటు సముద్రమట్టం నుంచి 3.1నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని..29లోగా బలపడే సూచనలుఉన్నాయని తెలిపింది. దీంతో 27,28,29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories