Telangana News: బెటాలియన్ కానిస్టేబుల్స్‌ నిరసనలతో ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana News: తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుల్స్‌ నిరసనలు హోరెత్తుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 30 Oct 2024 6:21 PM IST
SPF to Take Over Security of Telangana Secretariat
X

బెటాలియన్ కానిస్టేబుల్స్‌ నిరసనలతో ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana News: తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుల్స్‌ నిరసనలు హోరెత్తుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే సీఎం నివాసం దగ్గర స్పెషల్ పోలీసులను భద్రత నుంచి సెక్యురిటీ వింగ్ తొలగించగా.. తాజాగా సెక్రటేరియట్‌ దగ్గర TGSP భద్రతను ప్రభుత్వం తొలగించింది. సెక్రటేరియట్ భద్రతా నిర్వహణ బాధ్యతలు తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు అప్పగిస్తూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో ఏక్ స్టేట్–ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్లు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story