ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు

Sravan Rao Attended for SIT Investigation in Phone Tapping Case
x

ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు

Highlights

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట శ్రవణ్ రావు హాజరయ్యారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట శ్రవణ్ రావు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు ఏ6 గా ఉన్నారు. ఈ కేసులో తనకు రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం శ్రవణ్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.అయితే విచారణకు సహకరించాలని శ్రవణ్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది.

దీంతో విచారణకు హాజరుకావాలని ఈ నెల 26న సి‌ట్ బృందం శ్రవణ్ రావు ఇంట్లో నోటీసులు అందించారు. దీంతో శ్రవణ్ రావు ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తమ ఫోన్లను ట్యాపింగ్ చేసిందని అప్పట్లో పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories