SRH Vs HCA వివాదంలో సంచలనం: హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్

SRH Vs HCA వివాదంలో సంచలనం: హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్
x

SRH Vs HCA వివాదంలో సంచలనం: హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్

Highlights

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య కొనసాగుతున్న వివాదం తాజాగా కీలక మలుపు తిరిగింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును బుధవారం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు పాలక మండలిలోని మరికొంతమంది సభ్యులు కూడా అరెస్టయ్యారు.

ఈ చర్యలు ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా తీసుకున్నట్లు సమాచారం. జగన్మోహన్ రావు హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో SRH ఫ్రాంచైజీని బెదిరించి, ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లలో 20 శాతం వాటాను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది.

గతంలో ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో HCA ఇప్పటికే 10 శాతం కాంప్లిమెంటరీ టికెట్లు పొందుతున్నా, అదికాక మరో 10 శాతం టికెట్లను డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఆర్‌హెచ్ ఈ బెదిరింపులపై బీసీసీఐకి ఫిర్యాదు చేయగా, మ్యాచ్‌ల వేదికను మార్చాలన్న అభ్యర్థన కూడా చేసిందని తెలుస్తోంది. ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది.

ఉప్పల్ స్టేడియం సామర్థ్యం సుమారు 37,000 సీట్లుండగా, దానిలో 10 శాతం టికెట్లు హెచ్‌సీఏకు కేటాయించబడ్డాయి. అయితే అదిప్పటికీ తక్కువనే భావించిన హెచ్‌సీఏ, అదనంగా మరిన్ని టికెట్లను డిమాండ్ చేయడంతో SRH యాజమాన్యం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా, వీఐపీ బాక్స్‌లకు తాళాలు వేయడం వంటి ఘటనలతో ఈ వివాదం మరింత ముదిరింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించగా, దర్యాప్తులో జగన్మోహన్ రావుతో పాటు పలువురి పాత్ర బయటపడింది. దీనితో సంబంధించి సీఐడీ అధికారులు జగన్మోహన్ రావును అరెస్ట్ చేసి, ఈ వివాదాన్ని మరో దశకు తీసుకెళ్లారు.

ఈ సంఘటన ప్రస్తుతం టెలంగాణలో క్రికెట్ పరిపాలనపై అనేక ప్రశ్నలను రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories