Vikarabad: అర్థరాత్రి దారుణం… ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిపై కత్తితో దాడి

Vikarabad: అర్థరాత్రి దారుణం… ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిపై కత్తితో దాడి
x

Vikarabad: అర్థరాత్రి దారుణం… ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిపై కత్తితో దాడి 

Highlights

Vikarabad: వికారాబాద్‌ జిల్లా రాకొండలో అర్ధరాత్రి దారుణం జరిగింది. ఇండిపెండెంట్‌గా పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగిన యువకుడు అర్జున్‌పై కత్తితో దాడి జరిగింది.

Vikarabad: వికారాబాద్‌ జిల్లా రాకొండలో అర్ధరాత్రి దారుణం జరిగింది. ఇండిపెండెంట్‌గా పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగిన యువకుడు అర్జున్‌పై కత్తితో దాడి జరిగింది. అర్జున్‌కు పొత్తికడుపు భాగంలో మూడుచోట్ల గాయాలు కాగా వెంటనే పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అర్జున్‌ ఆరోగ్యం నిలికడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ముసుగు ధరించిన ఓ వ్యక్తి తనపై దాడి చేసినట్టు బాధితుడు చెబుతున్నాడు.

రాకొండ గ్రామ యువకులు అర్జున్‌ను ప్రోత్సహించి సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీలో ఉంచారు. అయితే ప్రజల నుంచి తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ప్రత్యర్థులు దాడి చేయించారని అర్జున్‌ స్నేహితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సర్పంచ్‌ అభ్యర్థిపై దాడి నేపథ్యంలో గ్రామంలో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు రాకొండలో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories