బీఆర్ఎస్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్: ఇంకెంత గడువు కావాలన్న 'సుప్రీం'

Supreme Court Asks Deadline to act on Defected MLAs
x

బీఆర్ఎస్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్: ఇంకెంత గడువు కావాలన్న 'సుప్రీం'

Highlights

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలన్న పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.

Supreme Court on BRS MLAs: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలన్న పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు 2024 మార్చి- మే మధ్య కాలంలో పార్టీని వీడారు. వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్ కుమార్,పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకోనందున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తగిన సమయంలోపుగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు 2024 నవంబర్ లో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు ఆదేశించినా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ నాయుకులు ఈ ఏడాది జనవరిలో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారిస్తామని కోర్టు తెలిపింది. దీంతో ఈ పిటిషన్ల విచారణను సోమవారం ప్రారంభించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకెంత కాలం కావాలని సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. స్పీకర్ తో చర్చించి కోర్టుకు వివరాలు అందిస్తామని రోహత్గీ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories