Thummala Nageswara Rao: ఖరీఫ్‌లో ఇంకా 2 లక్షల టన్నుల యూరియా కావాలి

Thummala Nageswara Rao: ఖరీఫ్‌లో ఇంకా 2 లక్షల టన్నుల యూరియా కావాలి
x
Highlights

Thummala Nageswara Rao: కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనుప్రియా పటేల్‌తో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు భేటీ అయ్యారు.

Thummala Nageswara Rao: కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనుప్రియా పటేల్‌తో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు భేటీ అయ్యారు. రాష్ర్టంలో ఖరీఫ్ సీజన్ లో ఏర్పడిన యూరియా కొరతపై చర్చించారు. తెలంగాణకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. రబీసీజన్ లో ప్రతి నెల రైతులకు రెండు లక్షల టన్నుల యూరియా అందించి... ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. జియో పొలిటికల్ కారణంగానే యూరియా సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయని కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ చెప్పారు. వీలైనంత త్వరగా తెలంగాణకు అవసరమైన యూరియా సరఫరా చేస్తామని మంత్రి తుమ్మలతో చెప్పారు.

ఢిల్లీలో కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుపై కేంద్ర మంత్రితో మంత్రి తుమ్మల చర్చించారు. దీనిపై రామ్మోహన్‌నాయుడు సానుకూలంగా స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories