Telangana Assembly Sessions 2025: మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

Telangana Assembly Sessions 2025: మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
x

Telangana Assembly Sessions 2025: మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

Highlights

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఇవాళ వాడివేడిగా సాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభలోపల, బయట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఇవాళ వాడివేడిగా సాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభలోపల, బయట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం తరపున మూడు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు:

2025 తెలంగాణ పురపాలక సంఘాల (మూడవ సవరణ) బిల్లు

2025 తెలంగాణ పంచాయతీరాజ్ (మూడవ సవరణ) బిల్లు

2025 తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల (రిజిస్ట్రికరణ, క్రమబద్ధీకరణ) చట్టం రద్దు బిల్లు

కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ

బిల్లులపై చర్చ అనంతరం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదికపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ నివేదికను సీబీఐకి ఇవ్వాలా లేదా సిట్ విచారణ జరపాలా అన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇద్దరు కీలక మంత్రులు సీబీఐ విచారణను సిఫార్సు చేసినట్లు సమాచారం.

ప్రతిపక్షంపై కఠిన వైఖరి

అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రవర్తనపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ పోడియానికి రావడం, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం వంటి చర్యలకు వేటు వేసే అవకాశం ఉందని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories