పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్ల పోరుబాట

పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్ల పోరుబాట
x

పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్ల పోరుబాట

Highlights

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్టర్లు ఆందోళనకు సిద్దమవుతున్నారు.

పెండింగ్‌లో వందలకోట్ల రూపాయల బిల్లులు...అసంపూర్తిగా మిగిలిపోతున్న పనులు.. లక్ష్యం చేరని ప్రగతి. సహకరించని సర్కార్...ఆర్థిక ఇబ్బందుల్లో కాంట్రాక్టర్లు..ఈ నెలాఖరు నాటికి బిల్లులు చెల్లించకపోతే పనులు నిలిపివేస్తామని హెచ్చరికలు..పెండింగ్ బిల్లుల కోసం నిరవధిక ఆందోళనకు సిద్దమవుతున్న కాంట్రాకర్లపై hmtv రిపోర్ట్.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్టర్లు ఆందోళనకు సిద్దమవుతున్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అభివృద్ది పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు జరగలేదు. తమ పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం జిల్లా కలెక్టర్లను జిల్లా బిల్డర్ అసోసియేషన్ సంఘం ప్రతినిధులు కలిసి విన్నవించారు. బిల్లులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోయామని వాపోయారు. బిల్లుల కోసం హైదరాబాద్‌ వెళ్లి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, నీటిపారుదల, మున్సిపల్, సంక్షేమ శాఖలతో పాటు ఇతర శాఖల పరిధిలోని పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు కాంట్రాక్టర్లు పోరుకు దిగుతున్నారు. ఈ నెల 30వ తేదీలోగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే డిసెంబర్ నుంచి ప్రస్తుతం కొనసాగుతున్నపనులు నిలిపివేస్తామంటున్నారు. భవిష్యత్ లో ప్రభుత్వం మంజూరు చేసే కొత్త పనులు చేపట్టబోమని, టెండర్లు వేయమని చెబుతున్నారు.

విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మనఊరు మన బడి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించిన బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. సర్కార్ తమకు బకాయి పడ్డ బిల్లులు చెల్లించాలని... లేకపోతే అన్ని రకాల పనులు స్తంభింపజేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు కాంట్రాక్టర్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories