Telangana DGP Appointment: తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

Telangana DGP Appointment: తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
x
Highlights

Telangana DGP Appointment: తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP) నియామకంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది.

Telangana DGP Appointment: తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP) నియామకంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. ప్రస్తుతం ఇన్-ఛార్జ్ డీజీపీగా ఉన్న బి. శివధర్‌రెడ్డి నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం, నాలుగు వారాల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.

గతంలో ఈ నియామకానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం సమర్థించింది. హైకోర్టు తీర్పుపై దాఖలైన అప్పీల్‌ను విచారించిన ధర్మాసనం, నియామక ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని స్పష్టం చేసింది.

గత ఏప్రిల్ నెలలో తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని యూపీఎస్సీ (UPSC)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వచ్చే నాలుగు వారాల్లోగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి డీజీపీ నియామకాన్ని కొలిక్కి తీసుకురావాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ తీర్పుతో తెలంగాణ పోలీస్ బాస్‌ నియామకంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories