సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు రాస్తారోకో

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు రాస్తారోకో
x

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు రాస్తారోకో 

Highlights

ఇటీవల కురిసిన వర్షాలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళనకు దిగారు.

ఇటీవల కురిసిన వర్షాలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు రాస్తారోకో చేపట్టారు. తుఫాన్ ప్రభావంతో వారం రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెబుతూ దాటవేస్తున్నారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే అధికారులు కొనుగోలు చేసి, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులు చేపట్టిన రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories