New Year 2025 Celebrations: ఫ్లైఓవర్ల మూసివేత, మందుబాబులకు గుడ్ న్యూస్

New Year 2025 Celebrations: ఫ్లైఓవర్ల మూసివేత, మందుబాబులకు గుడ్ న్యూస్
x
Highlights

New Year 2025 Celebrations: న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి...

New Year 2025 Celebrations: న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఐటీ కారిడార్‌లో ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్టు పోలీసులు తెలిపారు. ఓఆర్ఆర్‌పై భారీ వాహనాలు, ఎయిర్ పోర్టుకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు ప్రకటించారు. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్ మార్గ్, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, ట్యాంక్ బండ్ మీదుగా వాహనాలకు అనుమతి ఉండదని పోలీస్ శాఖ ప్రకటించింది. ఫ్లైఓవర్ల మూసివేతతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందని పోలీసులు వాహనదారులకు సూచించారు.

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు

న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకొని మెట్రో రైలు వేళల్లో మార్పులు చేశారు. జనవరి 1 తెల్లవారుజాము 12.30 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులను నడపనున్నారు. ప్రతి కారిడార్‌లో చివరి మెట్రో స్టేషన్ నుంచి ఆఖరి సర్వీస్ 12.30 గంటల వరకు బయలుదేరుతుందని సోషల్ మీడియాలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రకటించారు.

మందు బాబులకు ఉచిత ప్రయాణం

మద్యం మత్తుల్లో వాహనాలు నడపవద్దనే ఉద్దేశంతో ఉచిత ప్రయాణానికి తెలంగాణ ఫోర్ వీల్స్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని అసోసియేషన్ ప్రకటించింది. మద్యం మత్తులో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలు చేయకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అసోసియేషన్ వివరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories