Godavari Pushkaralu: గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పరిశీలనకు క్యాబినెట్‌ సబ్‌కమిటీ

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పరిశీలనకు క్యాబినెట్‌ సబ్‌కమిటీ
x

 Godavari Pushkaralu: గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పరిశీలనకు క్యాబినెట్‌ సబ్‌కమిటీ

Highlights

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గోదావరి పుష్కరాలపై అధ్యయనం చేసి నిర్వహణ తేదీలను ఖరారు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు సబ్ కమిటీ చైర్మన్‌గా శ్రీధర్ బాబును నియమించింది.

సభ్యులుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ ,అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహా దారు సుదర్శన్ రెడ్డిలు ఉన్నారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి..? నిర్వహణ బాద్యతలు అప్పగింత వంటి అంశాలపై చర్చించి.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories