Govt Scheme: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఈ నెల 10 నుంచి అకౌంట్‌లోకి డబ్బులు

Govt Scheme: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఈ నెల 10 నుంచి అకౌంట్‌లోకి డబ్బులు
x
Highlights

తెలంగాణలోని మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మేలు చెయ్యబోతోంది. ముఖ్యంగా డ్వాక్రా (స్వయం సహాయక సంఘాల) మహిళలకు వడ్డీ లేని రుణాల రూపంలో మద్దతు అందించేందుకు భారీగా చర్యలు చేపట్టింది.

తెలంగాణలోని మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మేలు చెయ్యబోతోంది. ముఖ్యంగా డ్వాక్రా (స్వయం సహాయక సంఘాల) మహిళలకు వడ్డీ లేని రుణాల రూపంలో మద్దతు అందించేందుకు భారీగా చర్యలు చేపట్టింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించిన వివరాల ప్రకారం, ప్రతి ఏడాది కనీసం రూ.20 వేల కోట్ల రుణాలను వడ్డీ లేకుండా అందించనున్నారు.

ఈ నెల జూలై 10 నుంచి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమక్షంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వడ్డీ లేని రుణాలతో పాటు బ్యాంకు లింకేజ్, లోన్ బీమా, ప్రమాద బీమా వంటి పథకాలను మహిళలకు అందిస్తారు.

జూలై 7 నుంచి 9 వరకు మహిళా సంఘాలకు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశాల్లో, అందిన రుణాలను ఎలా వినియోగించాలి, ఏ రంగాల్లో పెట్టుబడి పెట్టాలి వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.

ఇదే సమయంలో మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసిన RTC బస్సులు ఇప్పుడు TSRTCకి అద్దెకు ఇవ్వబడుతున్నాయి. మొదటి దశగా కోటి రూపాయల ఆదాయం మహిళా బృందాలకు RTC చెల్లించింది. రాబోయే కాలంలో మహిళలకు మరింత ఆదాయం వస్తుందని అంచనా.

అంతేగాక, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, క్యాంటీన్‌లు, పాఠశాల మరమ్మతులు, డ్రెస్‌ల తయారీ వంటి ప్రభుత్వ పనులను మహిళా బృందాలకు అప్పగించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బృందాల తయారీ చేసిన వస్తువులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఆలోచనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

అంతకుముందు BRS హయాంలో మహిళా సంఘాలకు ప్రోత్సాహం తక్కువగా ఉందని విమర్శలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఈ పథకాలను పునఃప్రారంభించింది. ఇప్పటికే రెండు విడతలుగా వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారు.

“రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తోంది” అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తొలి సంవత్సరం రూ.21 వేల కోట్ల రుణాలు విడుదల కాగా, ప్రతీ ఏడాది కనీసం రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు.

మహిళల ఆర్థిక స్వావలంబనపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా కార్యాచరణను ప్రారంభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories