New Ration Card: మీసేవలో రేషన్ కార్డులు..ఈ విధంగా అప్లై చేసుకోండి..!

Telangana Launches New Ration Card Scheme How to Apply  Eligibility Details
x

New Ration Card: మీసేవలో రేషన్ కార్డులు..ఈ విధంగా అప్లై చేసుకోండి..!

Highlights

Ration Card: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది.

Ration Card: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది. 2025 జనవరి 26 నుంచి ఈ కొత్త పథకం అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు రేషన్ కార్డు లేని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ (FSC) తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం మూడు రకాల రేషన్ కార్డులు ఇస్తున్నప్పటికీ, ఈ కొత్త స్కీమ్ కింద ఫుడ్ సెక్యూరిటీ కార్డు (FSC) మాత్రమే అందుబాటులో ఉంది. అర్హులైన అభ్యర్థులు ఇప్పుడు FSC కార్డు కోసమే దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ప్రక్రియ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

ఎవరెవరికి అర్హత ఉంది?

ఈ రేషన్ కార్డు పొందేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయ పరిమితి అనుసరించి అర్హతను నిర్ణయిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వ్యక్తుల వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలలోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాల వార్షిక ఆదాయం రూ.2 లక్షలలోపు ఉండాలి.

రేషన్ కార్డు ప్రయోజనాలు

ఈ కొత్త రేషన్ కార్డుతో లబ్ధిదారులు తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పులు, చక్కెర తదితర వాటిని పొందవచ్చు. అదనంగా, ఇది ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో హక్కుగా ఉపయోగపడే ప్రాథమిక గుర్తింపు కార్డుగా కూడా వ్యవహరిస్తుంది.

ఎలా అప్లై చేయాలి?

1. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ (Meeseva Portal ద్వారా)

ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలంటే:

స్టెప్ 1: మీసేవా అధికారిక వెబ్‌సైట్ (Meeseva Portal) ఓపెన్ చేయాలి.

స్టెప్ 2: లాగిన్ చేసి, ‘Apply for Food Security Card Online’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 3: అప్లికేషన్ ఫామ్‌లో డిటేల్స్ జాగ్రత్తగా నింపాలి.

స్టెప్ 4: అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఫామ్‌ను సబ్మిట్ చేయాలి.

స్టెప్ 5: అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత, అప్లికేషన్ నంబర్‌ను సేవ్ చేసుకోవాలి.

2. ఆఫ్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ (Meeseva Center లేదా CSC ద్వారా)

దగ్గరలో ఉన్న మీసేవా సెంటర్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC) వెళ్లాలి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ (FSC) అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. ఫామ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్లు అటాచ్ చేసి, సెంటర్లో సబ్మిట్ చేయాలి.

రేషన్ కార్డు కోసం అవసరమైన డాక్యుమెంట్లు:

ప్రధాన గుర్తింపు కార్డు: ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు

అడ్రస్ ప్రూఫ్: డొమిసైల్ సర్టిఫికేట్ / రేషన్ కార్డు / ఏదైనా అధికారిక చిరునామా ధృవీకరణ పత్రం

మొబైల్ నంబర్: తప్పనిసరిగా ఉండాలి

ఫోటో: తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో

రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడం ఎలా?

దరఖాస్తు చేసిన తర్వాత, EPDS తెలంగాణ వెబ్‌సైట్ (EPDS Portal) ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు.

స్టెప్ 1: EPDS తెలంగాణ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.

స్టెప్ 2: హోమ్‌పేజీలో ‘FSC Search’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.

స్టెప్ 3: ‘FSC Application Search’ ఆప్షన్‌ను ఎంచుకొని, జిల్లా, అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయాలి.

స్టెప్ 4: ‘Search’ బటన్‌పై క్లిక్ చేస్తే, మీ రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది.

ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే, EPDS పోర్టల్‌లో Grievance Request ద్వారా రీ-ఎవాల్యుయేషన్ కోసం అప్లై చేయవచ్చు.

కొత్త రేషన్ కార్డులకు తాత్కాలిక బ్రేక్

ప్రస్తుతం తెలంగాణలో MLC ఎన్నికల కారణంగా కొత్త రేషన్ కార్డుల జారీని ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొత్త దరఖాస్తులను ఆపివేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ మీసేవా ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు Meeseva Portal: https://meeseva.telangana.gov.in/meeseva/home.htm, EPDS Telangana: https://epds.telangana.gov.in/FoodSecurityAct/ లను సందర్శించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories