Telangana Local Body Elections: లోకల్ బాడీ ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు షాక్, వాట్ నెక్స్ట్ అంటూ రేవంత్ సర్కార్ కీలక భేటీ

Telangana Local Body Elections: లోకల్ బాడీ ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు షాక్, వాట్ నెక్స్ట్ అంటూ రేవంత్ సర్కార్ కీలక భేటీ
x

Telangana Local Body Elections: లోకల్ బాడీ ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు షాక్, వాట్ నెక్స్ట్ అంటూ రేవంత్ సర్కార్ కీలక భేటీ

Highlights

Telangana Local Body Elections: గత వారం రోజులుగా రాష్ట్రమంతా ఒక్కటే చర్చ.. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతయా లేదా అని.. కానీ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టేతో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

Telangana Local Body Elections: గత వారం రోజులుగా రాష్ట్రమంతా ఒక్కటే చర్చ.. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతయా లేదా అని.. కానీ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టేతో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. దీనిపై వాట్ నెక్స్ట్ అంటూ, ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆలోచనలు.. ఉత్కంఠకు కారణం అవుతున్న బీసీ రిజర్వేషన్‌లు.. అసలేం జరుగనుంది.

ఈనెల తొమ్మిదిన బీసీ రిజర్వేషన్ల లోసం తెచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే ఇచ్చింది. అంతకుముందు ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ జీవో తేవడం. దీని ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఏకంగా నామినేషన్ల తొలిరోజే హైకోర్టు స్టే ఇవ్వడం.. నాలుగు వారాలలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. ఆ తర్వాత రెండు వారాలలో పిటిషనర్ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే .

కానీ నిన్న అర్ధరాత్రి హైకోర్టు ఎన్నికల సంఘానికి కీలక సూచన చేసింది. తాము ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్కు వ్యతిరేకం కాదని, రాజ్యాంగ బద్దంగా యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ఇవాళ న్యాయ నిపుణులు అధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. సోమవారం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

తాజాగా హైకోర్టు యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచన చేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం డైలామాలో పడినట్లు సమాచారం.. దీనిపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కీలక సమావేశం నిర్వహించారు. 42 శాతం రిజర్వేషన్ల జీవో పై హైకోర్ట్ స్టే, ఎన్నికల నిర్వహణకు క్లియరెన్స్ ఇవ్వడంతో. సుప్రీంకోర్టు గడప తొక్కెందుకు ప్రభుత్వం సిద్దమైంది. హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. దీనిపై సోమారం సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్తో ఫైట్ చేయనుంది. ఇక బీసీ రిజర్వేషన్ల హైకోర్టు స్టే, ఎన్నికలపై ఈనెల 16 సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగనుంది.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనే అంశం ఇపుడు అధికార కాంగ్రెస్ను ఎటు పాలుపోకుండా చేస్తుందట. దీనిపై రాష్ట్రపతి చట్టం కాకుండా పెండింగ్. ప్రత్యేక జీవో గవర్నర్ దగ్గర పెండింగ్, ప్రభుత్వం తెచ్చిన స్పెషల్ జీవో పై హైకోర్టు స్టే.. దీనికి తోడు యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ఓకే అనడంపై న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ప్రభుత్వం మల్లాగుల్లాలు పడుతుందట. మొత్తంగా హైకోర్టు స్టే పై సుప్రీంకోర్టు గడప ఎక్కితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశముంది. డిసెంబరులో లేదా జనవరిలో అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ చర్చ నడుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories