కాంగ్రెస్ మద్దతు ధర హామీ నీటిమూట.. కష్టాల కడలితో మొన్నజొన్న రైతు

కాంగ్రెస్ మద్దతు ధర హామీ నీటిమూట.. కష్టాల కడలితో మొన్నజొన్న  రైతు
x
Highlights

పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ మాట నీటి మూటే అయింది. మొక్కజొన్నకు ధర లేక రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు...

పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ మాట నీటి మూటే అయింది. మొక్కజొన్నకు ధర లేక రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సి వస్తుంది. ఇటు వర్షాల నుంచి మొక్కజొన్నను కాపాడుకోవడం కత్తిమీద సామే అవుతుంది.

నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతులను వర్షాలు నిండా ముంచాయి. జిల్లాలో వెయ్యి వంద ఎకరాల్లో మొక్కజొన్న పంట నాశనమైంది. వర్షాలతో ఆరబోసిన మొక్కజొన్న పంట తడిసి ముద్దవుతుంది. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ లో వర్షంతో దెబ్బతిన్న మొక్కజొన్న పంట రంగు మారుతుంది. వర్షంతో గింజ ఆరక ముందే నానడంతో గింజలకు మొలకలొచ్చే ప్రమాదం ఏర్పడింది. దీంతో పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దళారుల ఆధిపత్యం కొనసాగుతోంది. సహకార సంఘాలు, మార్క్‌ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాణ్యతను బూచీగా చూపించి దళారులు క్వింటాకు 1600 ల నుంచి రూ.1900ల వరకు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దళారులు తమ ఇష్టానుసారంగా మొక్కజొన్నకు ధర డిసైడ్ చేసి వారు అనుకున్న ధరకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

జిల్లాలో మొక్కజొన్న ఎక్కువగా ఆర్మూర్, రూరల్ నియోజకవర్గాల పరిధిలోనే పండిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ మొక్కొజొన్న పండిస్తున్నా తక్కువ విస్తీర్ణంలో పండిస్తారు. అందుకే ప్రతిసారి ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ ప్రాంత రైతులే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. మొక్కజొన్న పంటకు మిగతా పంటలకు లేని విధంగా ఒకింత ఊరట ఉండటం రైతులకు కలిసొస్తుంది. వానాకాలం సీజన్ లో మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్మడం ఎక్కువగా చేస్తారు. రైతులకు ఇది బాగా కలిసొస్తుంది. మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్మడం, కంకులు విడిగా అమ్మ డం వంటి వాటితో వచ్చే లాభం ఒకింత ఊరట కలిగించే అంశమనే చెప్పవచ్చు. జిల్లాలో రైతులు పండించిన మొక్కజొన్న పంట చేతికొచ్చి దాదాపు కోతలు కూడా పూర్తి కావస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల ఊసెత్తడం లేదు. కోతలు కోసి గింజను రోడ్లపై ఆరబెట్టుకున్న రైతులు వర్షాల భయంతో దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న కు మద్దతు ధర క్వింటాకు 2400 లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా మొక్కజొన్న కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రభుత్వం ప్రారంభించే కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో గ్యారంటీ లేదనే అభిప్రాయంతో తక్కువ ధరకైనా అమ్ముకునేందుకు రైతులు దళారుల వైపే మొగ్గు చూపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories