Telangana Municipal Elections 2026: నేటితో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర

Telangana Municipal Elections 2026: నేటితో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర
x
Highlights

Telangana Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టి సాయంత్రంతో తెరపడనుంది.

Telangana Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టి సాయంత్రంతో తెరపడనుంది. గతానికి భిన్నంగా ఈసారి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపింప చేశాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో రంగంలోకి దిగిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలన్న పట్టులతో ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు ఆయా పార్టీల నుంచి రెబల్స్ గా పోటీ చేస్తున్న అభ్యర్ధులు, ఇండిపెండెంట్ అభ్యర్దులు ప్రచారంలో మునిగి తేలారు. ర్యాలీలు, డప్పు చప్పుళ్లు, డీజే పాటల మోతలతో ప్రచారాన్ని హోరెత్తించారు. చివరి రోజు సుడిగాలి పర్యటనలకు నేతలు సిద్ధం అయ్యారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు తాయిలాలు ప్రకటిస్తున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి తన ప్రచార కార్యక్రమాలను వ్యూహాత్మకంగా చేపట్టారు. పురపాలక ప్రాంతాల్లో మోడల్ కోడ్ ఆప్ కండక్ట్ అమలులో ఉండటంతో సమీపంలోని గ్రామాల్లో సభలు నిర్వహించి కీలక ప్రకటనలు, హామీలు ఇచ్చారు. సభ నిర్వహించిన ప్రతీ చోట అనేక అభిృవృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రచార చేపట్టారు. అధికార పక్షానికి ధీటుగా విపక్ష పార్టీల నేతలు ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ తరపున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories