Telangana Panchayat Elections: ఇవాళ్టి నుంచి తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు

Telangana Panchayat Elections: ఇవాళ్టి నుంచి తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు
x

Telangana Panchayat Elections: ఇవాళ్టి నుంచి తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు

Highlights

Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడంతా పల్లెలకు చేరింది.

Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడంతా పల్లెలకు చేరింది. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు తొలి విడత ఎన్నికలకు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 11న ఫస్ట్‌ ఫేజ్‌లో 189 మండలాల్లో 4వేల 236 సర్పంచ్, 37వేల 440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు ముగిశాక, 30న వాటిని పరిశీలించి, అదేరోజు సాయంత్రం చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితాను వెల్లడిస్తారు. ఏమైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ 1న అప్పీలు చేసుకుంటే, 2న వాటిని పరిష్కరిస్తారు. 3న మధ్యాహ్నం 3 గంటల్లోగా ఉపసంహరణలు ముగిశాక, ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. తొలి విడత నామినేషన్ల స్వీకరణకు జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories