Nalgonda: వరద నీటిలో చిక్కుకున్న గురుకుల పాఠశాల.. 500 మంది విద్యార్థులను రక్షించిన అధికారులు

Nalgonda: వరద నీటిలో చిక్కుకున్న గురుకుల పాఠశాల.. 500 మంది విద్యార్థులను రక్షించిన అధికారులు
x

Nalgonda: వరద నీటిలో చిక్కుకున్న గురుకుల పాఠశాల.. 500 మంది విద్యార్థులను రక్షించిన అధికారులు

Highlights

Nalgonda: మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లిలోని గురుకుల పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకుంది.

Nalgonda: మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లిలోని గురుకుల పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకుంది.

సమీపంలో ఉన్న వాగు ఉధృతి కారణంగా ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాయ్స్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల ఆవరణలోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. ఆ సమయంలో పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల ఆవరణలోకి వరద ప్రవేశించడంతో విద్యార్థులు భయాందోళనలకు గురై కేకలు వేశారు.

సహాయక చర్యలు:

సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అధికారులు వేగంగా స్పందించి, తాడు (Ropes) సాయంతో విద్యార్థులను వరద నీటి నుంచి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ ఘటనపై నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించారు. ఆమె కొమ్మపల్లిలోని పాఠశాలను సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories