ఢిల్లీ టు హైదరాబాద్.. రాజ్యసభ టిక్కెట్ కోసం కాంగ్రెస్ నేతల హైలెవల్ లాబీయింగ్!


ఢిల్లీ టు హైదరాబాద్.. రాజ్యసభ టిక్కెట్ కోసం కాంగ్రెస్ నేతల హైలెవల్ లాబీయింగ్!
Telangana Rajya Sabha Elections 2026: రెండు రాజ్యసభ స్థానాలకు నామినేషన్ ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు.
Telangana Rajya Sabha Elections 2026: రెండు రాజ్యసభ స్థానాలకు నామినేషన్ ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. కొందరు రాష్ట్ర నేతల దగ్గర లాబీయింగ్ చేస్తుంటే, మరి కొందరు డిల్లీ అధిష్టానం దగ్గర లాబీయింగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీకానున్న రెండు రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నామినేషన్ ల పక్రియ మొదలుపెట్టింది. మార్చి 5 తో నామినేషన్ గడువు ముగియనుంది. టైమ్ దగ్గర పడుతుండటంతో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి మరోసారి అభిషేక్ సింఘ్వీ కే ఇస్తారని లీక్స్ వినిపించాయి. అయితే రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున ఆశావహులు ఉండడం మరొకటి తమిళనాడులో కాంగ్రెస్ పొత్తులో బాగంగా ఒక రాజ్యసభ సీటు డీఎంకే కాంగ్రెస్ ఇస్తుందని ప్రచారం నడుస్తుంది. అయితే అక్కడ నుండి అభిషేక్ మను సింగ్వికి ఇస్తారని ప్రచారం నడుస్తుంది. అయితే సామాజిక వర్గాల వారిగా ఆశిస్తున్న వారు రెడ్డి సామాజిక వర్గం నుండి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ ఉపరాష్ట్రపతిగా పోటీ చేసినప్పుడు రాజ్యసభ ఇస్తామని సుదర్శన్ రెడ్డి కి ప్రామిస్ చేసినట్టు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుండి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, వేం నరేందర్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డి, రోహిన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనీల్ ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎంను కలసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు త్యాగం చేసినందుకు తనకు రాజ్యసభ కు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. వీహెచ్ తన సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం పెద్దలను కలసి కోరారట. ఎస్సీ సామాజిక వర్గం నుంచి దొమ్మటి సాంబయ్య ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే రాష్ట్ర పార్టీనేతలు, ఢిల్లీ పెద్దలను కలసి తనకు అవకాశం ఇవ్వాలని దొమ్మటి సాంబయ్య కోరినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేతలలో తనకు ఒక్కనీకే పదవి రాలేదు కనుక నాకు రాజ్యసభ ఇవ్వాలనికోరుతున్నారట.
మాజీ ఎమ్మెల్యే సంపత్ కూడా రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. వీరు కాకుండా ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, పార్టీ సీనియర్ నేత కుసుమ కుమార్ లు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటీవల ఢిల్లీ వెల్లిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. పార్టీ సీనియర్ నేతలు అయిన వీహెచ్, కుసుమ కుమార్ లకు రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలసి కోరారు.
ఇలా సామాజిక వర్గాల వారిగా రాజ్యసభ ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఇంత మంది నేతలు పోటీ పడుతుండడంతో పీసీసీ పెద్దలు తలలు పట్టుకుంటుంన్నారట. ఇయ్యాల రేపో డిల్లీకి tpcc చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి పేర్లు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో అప్పటి వరకు తమవంతు ప్రయత్నం తాము చేస్తామంటుంన్నారు ఆశావాహులు. మరి రాజ్యసభ సీటు ఎవరిని వరిస్తుందో త్వరలోనే తేలనుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



