Ration Shops: రెండు నెలలు రేషన్‌ దుకాణాలు బంద్‌

Telangana Ration Shops to Remain Closed July August
x

Ration Shops: రెండు నెలలు రేషన్‌ దుకాణాలు బంద్‌

Highlights

Ration Shops: మూడు నెలల కోటా బియ్యం పంపిణీ’ కార్యక్రమం నేటితో ముగియనుంది.

Ration Shops: మూడు నెలల కోటా బియ్యం పంపిణీ’ కార్యక్రమం నేటితో ముగియనుంది. ఇప్పటికే జూన్‌, జూలై, ఆగస్టు నెలల కోటా బియ్యాన్ని పంపిణీ చేయడంతో, రేషన్‌ షాపులు రెండు నెలలపాటు మూతపడనున్నాయి. తిరిగి సెప్టెంబర్‌ నెలలో మళ్లీ రేషన్‌ బియ్యం పంపిణీ ప్రారంభమవుతుంది.

ప్రస్తుతం సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ పంపిణీ కొనసాగుతుంది. అయితే ఈసారి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని, మారుమూల గ్రామాలు, గిరిజన, కొండప్రాంతాల్లోని ప్రజలకు బియ్యం అందుబాటులో ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు నిర్ణయం తీసుకుంది. దేశమంతా ఒకేసారి మూడు నెలల కోటాను పంపిణీ చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం జూన్‌ 1నుంచి పంపిణీ ప్రారంభించింది. ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున, మొత్తం మూడు నెలలకుగాను 18 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతున్నా, రాష్ట్రంలో మాత్రం సన్నబియ్యం ఇవ్వడం విశేషం.

తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏప్రిల్‌, మే నెలల్లో నెల కోటాను నెలనెలకూ పంపిణీ చేసినా, జూన్‌ నుంచి కేంద్ర ప్రత్యేక ఉత్తర్వుల మేరకు 3 నెలలకుగాను సన్నబియ్యం పంపిణీ చేపట్టింది. ఈ ముగ్గురు నెలలకు మొత్తం 6 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 94.34 లక్షల రేషన్‌ కార్డులపై 3.6 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories