TG TET 2025: తెలంగాణ టెట్ పరీక్షలకు ఆన్‌లైన్ అప్లికేషన్ డైరెక్ట్ లింక్... లాస్ట్ డేట్ ఎప్పుడంటే...

Telangana TET 2025 application online started, TG TET 2025 schedule important dates
x

TG TET 2025: తెలంగాణ టెట్ పరీక్షలకు ఆన్‌లైన్ అప్లికేషన్ డైరెక్ట్ లింక్... లాస్ట్ డేట్ ఎప్పుడంటే... 

Highlights

TG TET 2025 online application direct link: తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Tet 2025) పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు నేటి నుండి అవకాశం...

TG TET 2025 online application direct link: తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Tet 2025) పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు నేటి నుండి అవకాశం కల్పిస్తున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 15 నుండి 30వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీ ఏటా రెండు విడతల్లో టెట్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అందులో భాగంగానే ఏప్రిల్ 11న టెట్ 2025 తొలి విడత పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేసింది. జూన్ 15 నుండి 30 తేదీల మధ్య ఆన్‌లైన్ ద్వారా టెట్ పరీక్షలు జరగనున్నాయి.

సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులకు (SGT posts in Telangana) అర్హత సాధించేందుకుగా వీలుగా టెట్ పేపర్ 1 పరీక్ష డిజైన్ చేస్తున్నారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు (SA posts in Telangana) అర్హత పొందేందుకు వీలుగా టెట్ పేపర్ 2 పరీక్షలను నిర్వహిస్తున్నారు. పేపర్ 2 లో మ్యాథ్స్-సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులపై రెండు వేర్వేరు పేపర్స్ ఉంటాయి. అభ్యర్థులకు ఆయా సబ్జెక్టులపై ఉన్న విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించడమే లక్ష్యంగా రెండు వేర్వేరు పేపర్స్ పరీక్షల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది.

టెట్ 2025 లో ఒక పేపర్‌కు రూ. 750, రెండు పేపర్లకు కలిపి రూ. 1000 ఫీజు వసూలు చేస్తున్నారు.

150 మార్కుల టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే, ఓసీలకు 90, బీసీలు 75, మిగిలిన వారికి 60 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది.

2024 టెట్ రెండో విడత పరీక్షలు గత జనవరిలో జరిగాయి. ఈ పరీక్షలకు 2,75,753 మంది దరఖాస్తు చేసుకుంటే, 2,05,278 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అందులో 83,711 మంది అభ్యర్థులు డీఎస్సీకి అర్హత సాధించారు.

TET-1 2025 Schedule - టెట్-1 2025 పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు

ఏప్రిల్ 11 - నోటిఫికేషన్ విడుదల

ఏప్రిల్ 15-30 - దరఖాస్తుల స్వీకరణ

జూన్ 9 నుండి టెట్ పరీక్షల హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

జూన్ 15-30 మధ్య పరీక్షలు నిర్వహిస్తారు.

ఉదయం 9 గంటల నుండి 11 :30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.

షెడ్యూల్ ప్రకారం జులై 22న టెట్ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు.

TG TET 2025 online application direct link - తెలంగాణ టెట్ పరీక్షలకు ఆన్‌లైన్ అప్లికేషన్ డైరెక్ట్ లింక్

Show Full Article
Print Article
Next Story
More Stories