Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు అతి భారీ వర్షసూచన

Telangana Weather Alert Heavy Rains Expected Due to Low-Pressure System Orange Alert Issued
x

Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు అతి భారీ వర్షసూచన

Highlights

Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం కారణంగా శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడి ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

జిల్లాల వారీగా హెచ్చరికలు:

శుక్రవారం (ఈరోజు): ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

శనివారం: నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆదివారం: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.

వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories