Telangana Weather Alert: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం – 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telangana Weather Alert: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం – 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్
x

Telangana Weather Alert: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం – 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Highlights

తెలంగాణలో మరోసారి వర్ష బీభత్సం.. నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం – 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telangana Weather Alert: తెలంగాణలో వర్షాలు మరోసారి విజృంభించబోతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా నివేదిక ప్రకారం, నేడు (జూన్ 10) మరియు రేపు (జూన్ 11) పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, గాలి దిశల మార్పు కారణంగా రాష్ట్రంలో వర్షపాతం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం జరిగిన వర్షపాతం గణాంకాలను చూస్తే, కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 9 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు:

భద్రాద్రి కొత్తగూడెం

ఖమ్మం

సూర్యాపేట

నల్గొండ

మహబూబాబాద్

రంగారెడ్డి

హైదరాబాద్

మేడ్చల్ మల్కాజ్‌గిరి

వికారాబాద్

సంగారెడ్డి

మెదక్

కామారెడ్డి

మహబూబ్‌నగర్

నాగర్‌కర్నూల్

వనపర్తి

నారాయణపేట

జోగులాంబ గద్వాల

ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ముందస్తు జాగ్రత్తలు:

వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

బుధవారం, గురువారం, శుక్రవారం రోజులు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories