Chikoti Praveen: గో రక్షకుడిపై దాడి: కాంగ్రెస్ పాలనలో భద్రత లేదు, నిందితుడిని అరెస్ట్ చేయాలి

Chikoti Praveen: గో రక్షకుడిపై దాడి: కాంగ్రెస్ పాలనలో భద్రత లేదు, నిందితుడిని అరెస్ట్ చేయాలి
x
Highlights

Chikoti Praveen: హైదరాబాద్​ లక్డీకాపూల్​లోని డీజీపీ కార్యాలయం వద్ద భారీ ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు డీజీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.

Chikoti Praveen: హైదరాబాద్​ లక్డీకాపూల్​లోని డీజీపీ కార్యాలయం వద్ద భారీ ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు డీజీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈ ముట్టిడిలో బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి చికోటి ప్రవీణ్ పాల్గొన్నారు. నిన్న గోరక్ష సభ్యులపై జరిగిన దారుణ కాల్పులను ఆయన తీవ్రంగా ఖండించారు. దాడిలో గాయపడిన గోరక్ష సభ్యుడు ప్రశాంత్ సింగ్ సోనూను.. చికోటి ప్రవీణ్ పరామర్శించారు.

ఈ ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్-పోచారం ప్రాంతంలో గోరక్ష సభ్యులపై కాల్పులు జరిపిన వ్యక్తి.. ఇబ్రహీం అని పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చికోటి ప్రవీణ్ డిమాండ్ చేశారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రజలకు, ఇళ్లకు, ఆస్తులకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. గోరక్షణ చట్టాలు అమలులో లేకపోవడంతో గోరక్షకులు నిర్బంధాలు ఎదుర్కొంటున్నారని, వారిని రక్షించాల్సిన ప్రభుత్వం.. పోలీస్ వ్యవస్థ చేతే అక్రమ అరెస్టులు చేయించి, దాడులు జరిపిస్తున్నదని చికోటీ ప్రవీణ్‌ మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories