TGSRTC: బతుకమ్మ, దసరాకు టీజీఎస్‌ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు

TGSRTC: బతుకమ్మ, దసరాకు టీజీఎస్‌ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు
x
Highlights

TGSRTC: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా టీజీఎస్‌ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

TGSRTC: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా టీజీఎస్‌ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా 7,754 ప్రత్యేక బస్సులను నడపనుంది.

ఈ ప్రత్యేక సర్వీసుల్లో 377 బస్సులకు ముందుస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించారు. పండుగలకు సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగి వచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, అక్టోబర్ 5, 6 తేదీల్లో కూడా రద్దీని బట్టి అదనపు బస్సులను నడపడానికి టీజీఎస్‌ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ఈ ప్రణాళికతో ప్రయాణికులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories