హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై టోల్‌ ఛార్జీల పెంపు

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై టోల్‌ ఛార్జీల పెంపు
x
Highlights

Toll Fare: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ చార్జీలను పెంచారు. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన టోల్ చార్జీలు అమల్లోకి వస్తాయి.

Toll Fare: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ చార్జీలను పెంచారు. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన టోల్ చార్జీలు అమల్లోకి వస్తాయి. కారు, జీపు, వ్యాన్, లైట్ వెహికిల్స్ కు కి.మీ.కు 10 పైసలు పెంచారు. మినీ బస్, ఎల్‌సీవీలకు కిలోమీటరకు 20 పైసలు పెంచారు. 2 యాక్సిల్ బస్సులకు కి.మీకు 0.31 పైసలు , భారీ వాహనాలకు 0.69 పైసలు పెంచారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఐఆర్‌బీ సంస్థ 30 ఏళ్లకు లీజుకు తీసుకుంది. ప్రతి ఏటా ఐదు శాతం టోల్ ఛార్జీలు పెంచుకొనే వెసులుబాటు ఆ సంస్థకు ఉంది. దీంతో వచ్చే ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది.

దీంతో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఐఆర్‌బీ సంస్థ.ఔటర్ రింగ్ రోడ్డును ఐఆర్‌బీ సంస్థ రూ.7,380 కోట్లకు దక్కించుకుంది. కాంట్రాక్టు దక్కించుకున్న 16 నెలల్లోనే వెయ్యి కోట్లు ఆదాయం దక్కించుకుంది ఆ సంస్థ.ప్రతిరోజూ సగటున ఐఆర్‌బీకి రూ. 2 కోట్ల ఆదాయం లభిస్తోంది.

ఔటర్ రింగ్ రోడ్డుపై వసూలు చేసే టోల్ ఛార్జీలు

ప్రస్తుత ఛార్జీ ఏప్రిల్ 1 నుంచి ఛార్జీ

కారు, జీపు, వ్యాన్, లైట్ వెహికిల్స్ : రూ.2. 34 రూ.2.44

మినీ బస్, ఎల్‌సీవీ: రూ. 3.77 రూ. 3.94

2 యాక్సిల్ బస్సులు: రూ.6.69 రూ.7

Show Full Article
Print Article
Next Story
More Stories