Hyderabad: రూ.380తో హైదరాబాద్‌ చుట్టేయొచ్చు.. కొత్త ప్యాకేజీ ప్రకటించిన టూరిజం శాఖ

Tourism Department announces Hyderabad City Tour Summer New Package
x

రూ.380తో హైదరాబాద్‌ చుట్టేయొచ్చు.. కొత్త ప్యాకేజీ ప్రకటించిన టూరిజం శాఖ

Highlights

సమ్మర్‌లో హైదరాబాద్‌‌‌ను చుట్టేయాలని ఉందా..? ఎక్కువ ఖర్చు అవుతుందని ఫీల్‌ అవుతున్నారా..? అయితే అలాంటి వారి కోసం టూరిజం శాఖ కొత్త ప్యాకేజీని సిద్ధం చేసింది. కేవలం రూ.380తో ఒక్క రోజులో సిటీని చుట్టేసే బంపర్ ఆఫర్ అందిస్తోంది.

Hyderabad: సమ్మర్‌లో హైదరాబాద్‌‌‌ను చుట్టేయాలని ఉందా..? ఎక్కువ ఖర్చు అవుతుందని ఫీల్‌ అవుతున్నారా..? అయితే అలాంటి వారి కోసం టూరిజం శాఖ కొత్త ప్యాకేజీని సిద్ధం చేసింది. కేవలం రూ.380తో ఒక్క రోజులో సిటీని చుట్టేసే బంపర్ ఆఫర్ అందిస్తోంది. అదేంటో చూద్దాం.

సాధారణంగా సమ్మర్ వచ్చిదంటే చాలు పిల్లల్ని తీసుకొని వెకేషన్‌కి వెళ్లడానికి సిద్ధమవుతుంటారు. ఇక హైదరాబాద్‌లో పలు ప్రాంతాలను చూడాడానికి వెళ్తుంటారు. కానీ ఒక్క రోజులో అన్ని ప్లేస్‌లను చూడలేము. కొన్నింటిని మాత్రమే చూడగలము. అందుకే సమ్మర్‌లో హైదరాబాద్ సిటీ టూర్ వేద్దామని ప్లాన్ చేసేవారికి టూరిజం శాఖ కొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఇక రూ.380తో సిటీ మొత్తం చుట్టేయొచ్చు.

ఇందులో భాగంగా నాన్ ఏసీ, ఏసీ బస్సుల్లో బిర్లా మందిర్, చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్‌లో షాపింగ్, సాలార్ జంక్ మ్యూజియం, పురానీ హవేలీ (నిజాం జూబ్లీ పెవిలియన్), కుతుబ్ షాహీ టూంబ్స్, నెహ్రూ జూపార్క్, లుంబినీ పార్క్ చూడొచ్చు, నాన్ ఏసీలో పెద్దవారికి రూ.380. చిన్నారులకు రూ.300 టికెట్ ధర ఉంటుంది.

ఏసీ బస్సు అయితే పెద్దలకు రూ.500, చిన్నారులకు రూ.400 ఉంటుంది. ఆయా చోట్ల ఎంట్రీ టికెట్, ఫుడ్ ఖర్చులు టూరిస్టులే భరించాల్సి ఉంటుంది. వివరాలకు https://tourism.telangana.gov.in/package/hyderabadcitytour వెబ్ సైట్ ద్వారా లేదా 9848126947, 836728585, 9848540371 నంబర్లను సంప్రదించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories