TS Inter Exams 2026: రేపటి నుంచి తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ... 5 నిమిషాల సడలింపు


TS Inter Exams 2026: రేపటి నుంచి తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ... 5 నిమిషాల సడలింపు
TS Inter Exams 2026: రేపటి నుంచి తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం. విద్యార్థులకు ఉదయం 9.05 వరకు ప్రవేశానికి అనుమతి. రాష్ట్రవ్యాప్తంగా 9.97 లక్షల మంది హాజరు.
TS Inter Exams 2026: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి 2026 సంవత్సరానికి నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ప్రవేశానికి ఐదు నిమిషాల సడలింపు కల్పిస్తున్నట్లు మండలి ప్రకటించింది.
తాజా మార్గదర్శకాల ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షలకు విద్యార్థులను 9.05 గంటల వరకు అనుమతించనున్నారు. అయితే పరీక్ష సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యథాతథంగా కొనసాగుతుంది.
ట్రాఫిక్ రద్దీ లేదా రవాణా సమస్యల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ విద్యార్థులు ఉదయం 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో 4,89,126 మంది మొదటి సంవత్సరం, 5,07,949 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. మొత్తం 1,495 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



